Phone:+91 7702446633 / +91 9391007309

Email : vedavyasa2009@gmail.com

  • శ్రీ మాడపాటి లక్ష్మి నరసింహారావు

    htmlentities(కీర్తి శేషులు శ్రీ మాడపాటి లక్ష్మి నరసింహారావు( కరణం గారు) మాగల్లు గ్రామం నందిగామ మండలం కృష్ణాజిల్లా. జననం 07-01-1928 - మరణం 14-04-2005. కీర్తిశేషులు శ్రీ మాడపాటి నరసింహారావు గారు ది07-01-1928 తేదీన , కౌశికస గోత్రం ,కీర్తిశేషులు శ్రీ శివ రాజు నాగభూషణ రావు గారు శ్రీమతి సీతమ్మ గార్ల దంపతులకు, కృష్ణాజిల్లా, వత్సవాయి మండలం, కంభంపాడులో జన్మించినారు. తదుపరి తన రెండో ఏట కీర్తిశేషులు మాడపాటి వెంకట సత్యనారాయణ ,పిచ్చమ్మ గార్లకు( మాగల్లు గ్రామ కరణం గారు) దత్త పుత్రునిగా వచ్చారు కీర్తిశేషులు మాడపాటి లక్ష్మీ నరసింహారావు గారు ఎస్.ఎస్.ఎల్.సి వరకు విద్యాభ్యాసాన్ని నందిగామ హై స్కూల్ నుండి పూర్తి చేసి మాగల్లు గ్రామానికి వంశపారంపర్యంగా సంక్రమించిన కరణీకాన్ని ఉద్యోగంగా ఎంచుకొని ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1983 వ సంవత్సరంలో గ్రామ కరణాల వ్యవస్థను రద్దు చేసే వరకు, గ్రామ కరణంగా వ్యవహరించారు. కీర్తిశేషులు శ్రీ మాడపాటి లక్ష్మీ నరసింహారావు గారు మృదుస్వభావి, అజాత శత్రువు .మొత్తం ఏడుగురు సంతానం. ఏడుగురు సంతానంలో ఐదుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు. కీర్తిశేషులు మాడపాటి నరసింహారావు గారి జ్ఞాపకార్థం ,వారి మూడవ కుమారుడు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ మాడపాటి చంద్రమౌళీశ్వర రావు గారు ముందుగా మూడు లక్షల రూపాయలు ,కీర్తిశేషులు మాడపాటి లక్ష్మీ నరసింహారావు గారి ఎండోమెంట్ నిమిత్తమే వేదవ్యాస విద్యా విజ్ఞాన వారధి వారికి జాతీయ సేవ ఒక నిధిని ఏర్పరిచి, నిరంతరం దాని మీద వచ్చే వడ్డీతో వి విద్యార్థులను చదివించడానికి బహూకరించారు. శ్రీ చంద్రమౌళీశ్వరరావు గారు ఆ మూల నిధిని భవిష్యత్తులో పెంచటానికి కంకణబద్ధులై ఉన్నారు. లబ్దిదారులు : కే.సఎస్.వి.ఎల్.యెన్.అర్. సాకేత్ , తృతీయ సంవత్సరం , బి-టెక్ , సిదార్ధ ఇంజనీరింగ్ కాలేజీ , విజయవాడ. 2016-2017 సంవతరము నుండి. ,ENT_HTML5)

© 2019 Vedavyasa. All rights reserved | Design by WebGrid