Phone:+91 7702446633 / +91 9391007309

Email : vedavyasa2009@gmail.com

  • చుండూరు కాశీ విశ్వనాధ రావు శర్మ , సుబ్బలక్ష్మమ్మ దంపతుల జీవన స్మృతి పదము,

    htmlentities(కీర్తిశేషులు చుండూరు కాశీవిశ్వనాథ రావు శర్మ 1942, సంవత్సరమున తెనాలి పట్టణంన జన్మించిరి. వీరి మాతామహులు కీర్తిశేషులు సీతారామమ్మ ,పితరులు కీర్తి శేషులు రఘురత్నం దంపతులు. బాల్యము, కౌమారము తెనాలి పట్టణమున కొనసాగెను. ఉన్నత విద్య- సాంఘికశాస్త్ర పట్టభద్రులు. కీర్తిశేషులు వెంకట సుబ్బమ్మ తో కీర్తిశేషులు విశ్వనాథం గారి సుమారు 25 సంIIల వయస్సులో వివాహ శుభకార్యము జరిపించిరి. ముచ్చటగా ముగ్గురు పుత్రరత్నాలకు జన్మనిచ్చిరి. వీరి ఇరువురి అన్యోన్య దాంపత్యం ఆధ్యాత్మికఔన్నత్యమునకు వెసులుబాటు అయినది. మనస్సులు ఏకమై ధార్మికకార్మిక కార్యక్రమములకు చేదోడువాదోడుగా ఉండిరి. ధార్మిక కార్యక్రమాలకు సహాయసంపత్తులు నిరంతరంఅందించిరి. ఉదాహరణకు 1) బీద విద్యార్థులకు విద్యాభ్యాసమునకు ఇతోధిక ప్రోత్సాహము ,ఫీజులు, పుస్తకముల ఖర్చు నిమిత్తము వితరణ పేర్కొనదగినది 2 )”అన్ని దానములలో కన్నా అన్నదానము మిన్న” అని గుర్తెరిగిన పుణ్య దంపతులు. కాశీ ,శ్రీశైలం ,దుర్గ గుడి విజయవాడ మొదలలుగా గల పుణ్య క్షేత్రములోని అన్నదాన కార్యక్రమమునకు భారీ మొత్తంలో విరాళములు అందించిన దాతలు. 3 )”సర్వేంద్రియానం నయనం ప్రధానం” అన్న ఆర్యోక్తిని ఎరిగిన మహనీయులు. ధార్మిక నేత్రాలయములలో నేత్ర చికిత్సకు విరాళము అందించిన సహృదయులు సాంఘిక కార్యక్రమము నిర్వహణ ఒక ప్రక్కన, మరొక ప్రక్కన ఎల్.ఐ.సి బాధ్యతగల ఉద్యోగము వెరసి 35 సంవత్సరముల సుదీర్ఘ ఉద్యోగ నిర్వహణ తో పాటు విశ్వనాథం గారు చదరంగ క్రీడాకారునిగా ఎనలేని కీర్తిని ఆర్జించిరి. ఎన్నో జ్ఞాపికలను చదరంగం క్రీడ వీరికి బహుకరించిన ది. కాశీ విశ్వనాథం గారి వివాహము సుబ్బలక్ష్మి అనే జవ్వని తో (సుమారు 18 సంవత్సరముల వయస్సు) జరిగెను పుట్టు పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అన్న చందాన సుబ్బమ్మ గారి ఆధ్యాత్మిక ఔన్నత్యము మెట్టినింట వెలిగులు జిమ్మెను. వీరిరువురి వైవాహిక జీవితము’ హైదరాబద్ ‘ నగరము వేదిక అయ్యెను. అనతికాలంలోనే ‘మెహదీపట్నం’ వాసులు లలితా సహస్రనామ బృందంగా ఏర్పడిరి. సుబ్బమ్మ గారి నాయకత్వం ఈ బృందమునకు పటుత్వము. ప్రతి శుక్రవారము సభ్యులు గృహమునందు లలితా సహస్ర పారాయణం నిర్వహించేది వారు. 35 సంవత్సరముల సుదీర్ఘకాలము లలితాదేవి పారాయణము నిరాటంకముగా సాగెను. సుబ్బమ్మగారి నిరాడంబర జీవనము ,అందరినీ కలుపుకొని నవ్వుతూ, నవ్విస్తూ,గడిపిన మధుర స్మృతులు, నాటికీ నేటికీ మిత్రుల స్మృతి పదములో గిలిగింతలు పెడుతూనే ఉన్నవి. అంతేకాకుండా అతిధి అభ్యాగతులను ఆదరించిన పుణ్య గృహిణి. సన్నిహితులు ,బంధువులు వివాహాది శుభకార్యములు కార్యములు,పురుడు పున్యాధులను తన భుజస్కందాలపై ఉంచుకొని చిరునవ్వుతో స్వగృహము నిర్వహించిన సహనశీలి. విశ్వనాధం గారు సుబ్బలక్ష్మమ్మ దంపతులు విష్ణు సహస్రనామ పారాయణ బృందమునకు కేంద్ర బిందువై- బంధువులను స్నేహితులను కూర్చి లెక్కకుమించిన పుణ్యక్షేత్ర దర్శనా కాంక్షభిలాషులై కురుక్షేత్ర మహా పుణ్యక్షేత్రము లో కనీవినీ ఎరుగని రీతిలో విష్ణు సహస్రనామ యజ్ఞమును నిర్వర్తించిన సంధానకర్తలు. అమరనాథ్ కేదార్నాథ్ వారణాసి పుణ్యక్షేత్రములలో ఏకాదశ రుద్రాభిషేకమును నిర్వహించిన పుణ్య దంపతులు. .విష్ణుపూజాభిలాసక్తులై ‘ బద్రీనాథ్’ పుణ్యభూమిన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ సప్తాహము నిర్వహించిరి. ధర్మ నిధి ఏర్పాటు చేసిన వారు : చుండూరు సత్యనారాయణ మూర్తి మరియు కుటుంబ సభ్యులు. లబ్ది దారులు : కు. సర్వేపల్లి భవ్య సాయి. బి-టేక్ , IV సంవత్సరము , 2015-16 సహాయము చేయుచున్నాము ,ENT_HTML5)

© 2019 Vedavyasa. All rights reserved | Design by WebGrid